KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్

KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్

ఐపీఎల్ లో అద్భుతం చోటు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 250 కి పైగా పరుగులు చేస్తేనే గొప్ప అనుకుంటే.. 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ అలవోకగా ఛేజ్ చేసింది. సొంతగడ్డపై  కోల్‌కతాకు ఊహించని షాకిస్తూ ఐపీఎల్ చరిత్రలోనే భారీ స్కోర్ ఛేజ్ చేసింది. జానీ బెయిర్ స్టో(48 బంతుల్లో 108, 8 ఫోర్లు, 9 సిక్సులు) 45 బంతుల్లో విధ్వంసకర సెంచరీకి తోడు ఓపెనర్ సిమ్రాన్ సింగ్( 20 బంతుల్లో 54, 4 ఫోర్లు, 5 సిక్సులు) పవర్ ప్లే లో మెరుపులు.. చివర్లో శశాంక్ సింగ్( 28 బంతుల్లో 68, 2 ఫోర్లు, 8 సిక్సులు) పవర్ హిట్టింగ్ తో పంజాబ్ అసాధ్యమనుకున్న మ్యాచ్ లో కేకేఆర్ పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. 

మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ 18.4 ఓవర్లలోనే  ఛేజ్ 262 పరుగులు చేసి గెలిచింది. 9 మ్యాచ్ ల్లో పంజాబ్ కు ఇది 3 వ విజయం కాగా.. 8 మ్యాచ్ ల్లో కేకేఆర్ కు ఇది మూడో ఓటమి. 262 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ తొలి ఓవర్ నుంచి ధాటిగా ఆడింది.     

ముఖ్యంగా సిమ్రాన్ సింగ్ బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. మరో ఎండ్ లో బెయిర్ స్టో కూడా మెరుపులు మెరిపించడంతో పవర్ ప్లే లోనే 93 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే తర్వాత హాఫ్ సెంచరీ చేసిన సిమ్రాన్ సింగ్ ఔటయ్యాడు.  ఈ దశలో రూసో (26) సహకారంతో బెయిర్ స్టో చెలరేగాడు. బౌండరీలతో పరుగుల వరద పారించి మ్యాచ్ ను పంజాబ్ వైపుకు తిప్పాడు. 

రూసో ఔట్ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన శశాంక్ సింగ్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి పంజాబ్ కు త్వరగా విజయం అందించాడు. అంతక ముందు 
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోర్ చేసింది. నరైన్ 32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులతో 71 పరుగులు చేస్తే.. సాల్ట్ 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 75 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీసుకోగా.. సామ్ కరణ్, హర్షల్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.