- లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్
న్యూఢిల్లీ, వెలుగు: లోక్‌సభలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ను స్పీకర్ రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి దక్కిన గొప్ప విజయమని విపక్ష నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. సస్పెన్షన్ ఎత్తివేతతో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా ఎనిమిది మంది ఎంపీలు బుధవారం తిరిగి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలో ఎనిమిది మంది ఎంపీలతో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారికీ టీ పార్టీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సభలో ప్రజా సమస్యలపై గళం విప్పడంలో ఎట్టి పరిస్థితుల్లోను రాజీ పడొద్దని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అలాగే ప్రియాంక గాంధీ కూడా సస్పెన్షన్‌కు గురైన ఎంపీలను ప్రత్యేకంగా అభినందించారు. సస్పెన్షన్ కాలంలో ఎంపీలు చేపట్టిన ఆందోళనలు కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని తెలిపారు. ప్రజా సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లే పోరాటంలో ఎంపీలకు అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు.
