DC vs MI: ఓడినా వణికించారు: ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విక్టరీ

DC vs MI: ఓడినా వణికించారు: ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విక్టరీ

ఐపీఎల్ లో మరో మ్యాచ్ అభిమానులను అలరించింది. హై స్కోరింగ్ థ్రిల్లింగ్ లో ముంబై ఇండియన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ చివరి ఓవర్లో విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో 10 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 257 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 

258  పరుగుల లక్ష్య ఛేదనంలో ముంబైకి సరైన ఆరంభం లభించలేదు.  పవర్ ప్లే లోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 
ఓపెనర్ రోహిత్ శర్మ 8 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత ముకేశ్ కుమార్ ఇషాన్ కిషన్ ను పెవిలియన్ కు చేర్చాడు. వచ్చి రావడంతోనే మెరుపులు మెరిపించి సూర్య 13 బంతుల్లో 2 ఫోర్లు , 3 సిక్సులతో 26 పరుగులు చేసి పవర్ ప్లే చివరి బంతికి ఔటయ్యాడు. టాప్ ఆర్డర్ విఫలమైన మిడిల్ ఆర్డర్ అద్భుతంగా పోరాడింది. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య జట్టును ముందుండి నడిపించారు. 

Also Read:టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. గెలిస్తే ప్లే ఆఫ్ కు

వీరిద్దరూ నాలుగో వికెట్ కు 71 పరుగులు జోడించి ఇన్నింగ్స్ చక్క దిద్దారు. ఈ దశలో 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 46 పరుగులు చేసిన హార్దిక్ పాండ్య పెవిలియన్ బాట పట్టాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్ లో తిలక్ వర్మ(32 బంతుల్లో 63, 4 ఫోర్లు, 4 సిక్సులు) ఒంటరి పోరాటం చేశాడు. టీం డేవిడ్ తో కలిసి చివర్లో మెరుపులు మెరిపించాడు. అయితే లక్ష్యం మరీ పెద్దది కావడంతో ముంబై విజయానికి చేరుకోలేకపోయింది. చివరి ఓవర్లో 25 పరుగులు చేయాల్సిన దశలో తిలక్ రనౌట్ కావడంతో మ్యాచ్ ఢిల్లీ విజయం గెలుపు ఖాయమైంది.                

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 257 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ తొలి బంతి నుంచి ముంబై బౌలర్లపై దారుణంగా విరుచుకుపడ్డాడు. 27 బంతుల్లోనే 84 పరుగులు చేసి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 48, 6 ఫోర్లు, 2 సిక్సులు) చెలరేగడంతో జట్టు స్కోర్ 250 పరుగుల మార్క్ దాటింది.