ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్

ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ శుక్రవారం షెడ్యూల్​ రిలీజ్ చేశారు. ఈ నెల12 వరకు ఫస్ట్ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ర్టేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ​కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ మొదలవ్వనుంది. ఈ నెల 10 నుంచి 13 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది.10 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. 18న ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందినోళ్లు ఆయా కాలేజీల్లో 21లోగా రిపోర్టింగ్ చేయాలి. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్​లో భాగంగా 23న స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేష న్ల ప్రక్రియ ఉంటుంది. 24న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 25 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. 28న సీట్ల కేటాయింపు ఉంటుంది. 31లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. కాగా, 28న స్పాట్ అడ్మిషన్లకు గైడ్​లైన్స్ ఇవ్వనున్నారు.