1973, 1979 చమురు సంక్షోభం కంటే ఘోరం.. హార్మూజ్ జలసంధి మూసివేతపై IEA చీఫ్ ఆందోళన

1973, 1979 చమురు సంక్షోభం కంటే ఘోరం.. హార్మూజ్ జలసంధి మూసివేతపై IEA చీఫ్ ఆందోళన

హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో తలెత్తిన ప్రస్తుత చమురు, గ్యాస్ సంక్షోభం.. 1973, 1979, 2022లలో వచ్చిన సంక్షోభాలన్నింటినీ కలిపి చూసినా.. వాటి కంటే తీవ్రమైనదని అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) అధిపతి ఫాతిహ్ బిరోల్ 'లే ఫిగరో' వార్తా పత్రికకు వెల్లడించారు. ఇంతటి స్థాయిలో ఇంధన సరఫరాకు అంతరాయం కలగడాన్ని ప్రపంచం ఎన్నడూ చూడలేదని ఫ్రెంచ్ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.

ఐరోపా దేశాలతో పాటు జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు కూడా నష్టపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. చమురు సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ఇండియా లాంటి1 అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువగా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ వ్యూహాత్మక నిల్వల్లో కొంత భాగాన్ని విడుదల చేయడానికి IAE సభ్య దేశాలు మార్చిలో అంగీకారం తెలిపాయని, ఇందులో కొంత ఇప్పటికే విడుదల చేయబడిందని, ఈ ప్రక్రియ కొనసాగుతోందని బిరోల్ తెలిపారు.

ప్రస్తుతం హార్మూజ్ జలసంధి ఉత్తర తీరం ఇరాన్ కంట్రోల్‌‌‌‌లో ఉంది. దక్షిణ తీరం ఒమన్ ఆధీనంలో ఉంది. ప్రతి నెలా దాదాపు 3 వేల నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణిస్తున్నాయి. దీన్ని మూసేయడం వల్ల.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావం పడింది. ఆయిల్‌‌‌‌ కొనే దేశాలే కాదు.. ఎగుమతులపైనే ఆధారపడిన దేశాలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇరాన్ రోజుకు దాదాపు 1.7 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌‌ను ఎగుమతి చేస్తోంది.