అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశారు. హర్మూజ్ జల సంధి తెరవకపోతే.. ఏం జరుగుతుందో చెప్పేశాడు. ట్రంప్ మాటల్లోనే.. ఈ రాత్రి ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుంది. ఇరాన్ దేశాన్ని మళ్లీ పున:నిర్మించలేరు. అలా జరగాలని నేను కోరుకోవటం లేదు. అయినా అదే జరుగుతుంది అంటూ ట్రూత్ పోస్టులో తన స్టాంగ్ ఏంటో స్పష్టంగా చెప్పారు ట్రంప్. హర్మూజ్ ఓపెన్ కాకపోతే.. ఈ రాత్రికి ఇరాన్ దేశంలో నాగరికత అంతం అవుతుంది అంటూ ఫైనల్ గా స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు.
ఇరాన్ పాలనలో ఇప్పుడు మార్పు వచ్చింది. భిన్నమైన, తెలివైన, తీవ్రవాద భావజాలం తక్కువగా ఉన్న మనుషులు విజయం సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే అద్భుతమైనది ఏమైనా జరగొచ్చు.. ఎవరికి తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ కామెంట్ చేశారు ట్రంప్.
🚨Breaking
— Tawkeer 🦊 (@ZaaZu___) April 7, 2026
Trump said whole civilization will die tonight ⚠️ pic.twitter.com/vHD5tOOtRW
ప్రపంచ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన క్షణాల్లో ఒకటి ఈ రాత్రి మనం చూడబోతున్నాం.. తెలుసుకోబోతున్నాం. 47 ఏళ్ల ఇరాన్ పాలన దోపిడీ, అవినీతి చివరకు అంతం అవుతాయి. ఇరాన్ మహనీయులను దేవుడు ఆశీర్వదించుగాక అంటూ తన పోస్టు ద్వారా ఇరాన్ దేశానికి సందేశం పంపారు ట్రంప్.
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఇచ్చిన గడువు ముగిసేందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. డెడ్ లైన్ టైమ్ ముంచుకొస్తున్న ఇరాన్లో ఉలుకు లేదు పలుకు లేదు. దీంతో తీవ్ర ఆగ్రహం, నిరాశ, నిస్పృహలో ఉన్న ట్రంప్ మరోసారి ఇరాన్‌కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు.
ఇవాళ రాత్రి ఇరాన్ మొత్తం వినాశనమైపోతుందని.. ఆ దేశ నాగరికత మొత్తం తుడిచిపెట్టుకుపోవచ్చని సంచలన హెచ్చరికలు చేశారు. ‘‘ఈ రాత్రి ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుంది. దాన్ని మళ్లీ ఎప్పటికీ తిరిగి తీసుకురాలేరు. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు. కానీ బహుశా అది జరిగి తీరుతుంది” అని తన సోషల్ మీడియా ప్లా్ట్ఫామ్ ట్రూత్‌లో పోస్ట్ పెట్టారు ట్రంప్.
హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడంతో పాటు తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకోవాలని 2026, ఏప్రిల్ 7వ తేదీ వరకు ఇరాన్‌కు ట్రంప్ డెడ్ లైన్ విధించాడు. కానీ అమెరికా ప్రతిపాదించిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ నిర్మోహమాటంగా తిరస్కరించింది. తాత్కాలిక సీజ్ ఫైర్ అవసరం లేదని.. మొత్తం యుద్ధం ఆగిపోయేలా అగ్రిమెంట్ కావాలని కండిషన్ పెట్టింది.
ఇరాన్ మాత్రం ట్రంప్ హెచ్చరికలు, బెదిరింపులు లైట్ తీసుకుంది. ట్రంప్ ఫైనల్ వార్నింగ్‌పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. మొత్తం ఆ దేశ నాగరికతనే తుడిచిపెట్టేస్తామంటున్నావంటే అణు బాంబు వేస్తావా ఏంటీ సామీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నాగరికత అంతం చేయటం అంటే మామూలు బాంబులతో సాధ్యం కాదు.. ఇప్పుడు ఉపయోగిస్తున్న మిస్సైల్స్ దాడులతో అది జరగని పని. నాగరికత అంతం అంటే.. అణు బాంబులతోనే సాధ్యం.. ట్రంప్ ఇచ్చిన ఫైనల్ వార్నింగ్.. చేసిన కామెంట్లు చూస్తుంటే.. ఇరాన్ దేశంపై ఈ రాత్రి అణు బాంబులు వేస్తారా ఏంటి సామీ అన్న కామెంట్లు సోషల్ మీడియాను పోటెత్తుతున్నాయి.
