హైదరాబాద్ లో అక్రమంగా పోలో రింగ్స్ తయారీ... గోదాం సీజ్ చేసిన అధికారులు 

హైదరాబాద్ లో అక్రమంగా పోలో రింగ్స్ తయారీ... గోదాం సీజ్ చేసిన అధికారులు 

హైదరాబాద్ లో కల్తీ రాయుళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. వంటలోకి వాడే అల్లం వెలుల్లి పేస్ట్, వంట నూనె మొదలుకొని.. చిన్న పిల్లలు తినే చాక్లెట్ల వరకు దేనిని వదలకుండా కల్తీ చేసేస్తున్నారు కేటుగాళ్లు. రోజుకో కల్తీ బాగోతం బయటపడుతుంటే బయటి ఫుడ్ తినాలంటేనే వణుకుపుడుతోందని అంటున్నారు జనం. హైదరాబాద్ శివారులోని మైలార్ దేవ్ పల్లిలో మరో కల్తీ బాగోతం బయటపడింది. మంగళవారం ( ఏప్రిల్ 7 ) మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామికవాడలో అకస్మిక తనిఖీలు నిర్వహించారు హెచ్ ఫాస్ట్ అధికారులు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిర్వహిస్తున్న పోలో రింగ్స్ తయారీ గోదాంను సీజ్ చేశారు అధికారులు.

ఈ తనిఖీల్లో గోదాంలో నాణ్యతలేని, ప్రమాదకర రసాయనాలతో ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఈ పోలో రింగులు తయారవుతున్నట్టు తెలిపారు. దాడి సమయంలో భారీ ఎత్తున ముడి పదార్థాలు, తయారైన పోలో రింగులు, యంత్ర సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

అనంతరం గోదాంను సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు అధికారులు.ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు.