IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గౌహతి వేదికగా జరుగుతున్న కీలక పోరులో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన రాయల్స్ ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఆరంభం అందించారు. దూకుడైన బ్యాటింగ్ తో జైస్వాల్ ( 32 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు నాటౌట్ ) మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. వర్షం కారణంగా 11 ఓవర్ల పాటు జరిగిన మ్యాచులో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఇక దీపక్ చాహర్ మొదటి ఓవర్ వేసిన ఓవర్లోనే వరుసగా 4, 6, 4, 0, 4, 4 బౌండరీలు బాది ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు జైస్వాల్. అనంతరం రెండో ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ నే సిక్స్ కొట్టాడ వైభవ్.. సెకండ్ ఓవర్లో రెండు కొట్టి 14 పరుగులు రాబట్టారు.
ఇక 3వ ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో మొదటి రెండు బంతుల్లోనే వరుసగా సిక్సులు కొట్టిన జైస్వాల్ ఐపీఎల్ లో 100 సిక్సులు పూర్తి చేసుకున్నాడు. బౌల్ట్ వేసిన 3 ఓవర్ లో మరో 22 పరుగులు రాబట్టారు. అయితే 4వ ఓవర్ వేసిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బౌలింగ్ లో పరుగులు చేసేందుకు జైస్వాల్– వైభవ్ కాస్త ఇబ్బంది పడ్డారు. ఈ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. కాగా శార్దుల్ ఠాకూర్ వేసిన 5 ఓవర్లో 6,4,11,6 కొట్టిన తర్వాత వైభవ్ సూర్యవంశీ ( 14 బంతుల్లో 1 ఫోర్ 5 సిక్సులతో 39 పరుగులు) బౌండర్ లైన్ దగ్గర తిలక్ వర్మకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి చేరుకున్నాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన ధృవ్ జురెల్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 84 పరుగుల వద్ద AM ఘజన్ఫర్ బౌలింగ్ (5.5)లో జురెల్ LBWగా వెనుదిరిగాడు. దీంతో క్రీజులోకి వచ్చిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ (10 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 20 పరుగులు) ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ.. ఘజన్ఫర్ బౌలింగ్ (5.5)లో లాంగ్ ఆన్ లో ఉన్న తిలక్ వర్మకి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన షిమ్రాన్ హెట్మయర్ బ్యాటింగ్ లో కాస్త స్ట్రగుల్ అవుతుండగా.. జైస్వాల్ మాత్రం చివరి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టడంతో 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.
The sheer audacity of Vaibhav Sooryavanshi 🫡
— IndianPremierLeague (@IPL) April 7, 2026
🎥 The 1️⃣5️⃣ year old welcomes Jasprit Bumrah with a maximum! 👏#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/cI0zqCXz0X
