ఫ్రాడ్‌‌‌‌‌‌‌‌ మెసేజ్‌‌‌‌‌‌‌‌లు పెడితే  రూ.10 వేల ఫైన్‌‌‌‌‌‌‌‌

ఫ్రాడ్‌‌‌‌‌‌‌‌ మెసేజ్‌‌‌‌‌‌‌‌లు పెడితే  రూ.10 వేల ఫైన్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: నకిలీ ఎస్‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌లకు అడ్డుకట్ట వేయడానికి మరింత కఠినంగా ఉండాలని డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ టెలికం (డాట్‌‌‌‌‌‌‌‌) నిర్ణయించుకుంది. తప్పుడు హెడర్లతో కస్టమర్లను తప్పుదోవ పట్టించే కమర్షియల్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌లు పంపిన వారికి రూ.వెయ్యి నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించనుంది. ఫైన్‌‌‌‌‌‌‌‌ వేసిన తరువాత కూడా ఫేక్ మెసేజ్‌‌‌‌‌‌‌‌లను ఆపకుంటే, సెండర్‌‌‌‌‌‌‌‌ ఐడీని లేదా మొబైల్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌ను శాశ్వతంగా డీయాక్టివేట్‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. ఇలాంటి ఎస్‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌లను గుర్తించడానికి ప్రత్యేకంగా డేటా ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌, టెలికం ఎనలిటిక్స్‌‌‌‌‌‌‌‌ యూనిట్లను  ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్లు సంబంధిత ప్రభుత్వశాఖలతో కలిసి పనిచేస్తూ ఫేక్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌లను, సిమ్‌‌‌‌‌‌‌‌కార్డులను గుర్తిస్తాయి. కంప్లెయింట్లను పరిశీలిస్తాయి. టెలికం సర్వీసుల ద్వారా ఆర్థికపరమైన మోసాలు చేస్తే చర్యలు తీసుకోవడానికి సంబంధిత ఏజెన్సీలకు డాట్‌‌‌‌‌‌‌‌ సమాచారం అందిస్తుంది. కస్టమర్లు కంప్లెయింట్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు హరాస్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రింజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌ను తీసుకురానుంది.