వన్డేలు, టెస్ట్‌లకు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించా. ఇంక చాలు అని బోర్డు చెబితే టీ20ల నుంచి కూడా సంతోషంగా తప్పుకుంటా. టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ రౌండ్ ఆడడమే నా లక్ష్యం. మా టీమ్ నాకౌట్స్‌కు అర్హత సాధిస్తే.. ఆ తర్వాత ఎప్పుడైనా రిటైర్మెంట్ ప్రకటిస్తా. టీ20 మ్యాచ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ఒక్క ఓవర్‌లో మ్యాచ్ అంతా మారిపోతుంది. టీమ్‌లో టాలెంటెడ్ యంగ్‌స్టర్స్ ఉన్నారు. వాళ్లకి అవకాశాలివ్వాలని అనుకుంటున్నా. ధనాధన్ ఫార్మాట్‌లో బౌలర్లే మ్యాచ్ విన్నర్లు. – మలింగ, శ్రీలంక కెప్టెన్


