ఐఐటీ మద్రాస్‌ హ్యాట్రిక్‌ టాప్‌.. దిగజారిన హైదరాబాద్ వర్సిటీ ర్యాంక్

ఐఐటీ మద్రాస్‌ హ్యాట్రిక్‌ టాప్‌.. దిగజారిన హైదరాబాద్ వర్సిటీ ర్యాంక్

నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌‌ఎఫ్​) ర్యాంకుల్లో యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) కిందికి జారిపోయింది. గత ఏడాది బెస్ట్ యూనివర్సిటీల్లో ఆరో స్థానంలో నిలిచిన హైదరాబాద్ యూనివర్సిటీ.. 2021 ర్యాంకుల్లో తొమ్మిదో స్థానానికి దిగజారిపోయింది. అయితే ఇంజనీరింగ్ కాలేజీల ర్యాంకింగ్‌లో మాత్రం ఐఐటీ హైదరాబాద్‌ గత ఏడాది వచ్చిన ఏడో స్థానాన్ని అలాగే నిలబెట్టుకుంది. ఉన్నత విద్యా సంస్థల్లోని వసతులు, టీచింగ్, పనితీరు, రీసెర్చ్, ఫలితాలు వంటి పలు అంశాల ఆధారంగా కేంద్ర విద్యా శాఖ ఈ రోజు (గురువారం) దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీలకు ర్యాంకులు ప్రకటించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌ సంస్థ రూపొందించిన ర్యాంకులను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిలీజ్ చేశారు. 

ఎన్‌ఐఆర్‌‌ఎఫ్ ర్యాంకుల్లో ఐఐటీ మద్రాస్ హ్యాట్రిక్ కొట్టింది. దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో ఈ ఇన్‌స్టిట్యూట్ మరోసారి టాప్‌గా నిలిచింది. ఓవరాల్ కేటగిరీలో, ఇంజనీరింగ్ కేటగిరీలోనూ వరుసగా మూడోసారి ఫస్ట్ ర్యాంక్ సాధించింది. అలాగే రీసెర్చ్ సంస్థల కేటగిరీలో బెంగళూరు ఐఐఎస్సీ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది. ఓవరాల్ కేటగిరీలోనూ రెండోస్థానంలో నిలిచింది.

11 కేటగిరీలు.. ఈ ఏడాది కొత్తగా ఒకటి

మొత్తం పదకొండు కేటగిరీల్లో యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలకు ఎన్‌ఐఆర్‌‌ఎఫ్ ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఓవరాల్ కేటగిరీ, యూనివర్సిటీ, మేనేజ్‌మెంట్, కాలేజ్‌, ఫార్మసీ, మెడికల్‌, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్‌‌, ఏఆర్‌‌ఐఐఏ (అటల్‌ ర్యాకింగ్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆన్ ఇన్నోవేషన్ అచ్చీవ్‌మెంట్స్‌), లా, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్స్ కేటగిరీల్లో ఈ ర్యాంకులను వెల్లడించింది. అయితే ఈ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూషన్స్ విభాగాన్ని కొత్త ఈ ఏడాదే కేంద్రం ఈ ఎన్‌ఐఆర్‌‌ఎఫ్ ర్యాంకుల పరిధిలోకి తెచ్చింది. ఈ సంస్థ మన దేశంలోని ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు ఇవ్వడం ఇది వరుసగా ఆరో ఏడాది. ఈ సంవత్సరం ఎన్‌ఐఆర్‌‌ఎఫ్​ ర్యాంకింగ్ పోటీలో మొత్తం 6 వేల యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలు పోటీ పడ్డాయి.

అన్ని కేటగిరీల వారీగా ర్యాంకుల వివరాల కోసం ఈ nirfindia.org వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

NIRF Rankings 2021: ఓవరాల్ కేటగిరీలో టాప్‌–10

ఐఐటీ మద్రాస్

ఐఐఎస్సీ బెంగళూరు

ఐఐటీ బాంబే 

ఐఐటీ ఢిల్లీ

ఐఐటీ కాన్పూర్

ఐఐటీ ఖరగ్‌పూర్‌‌

ఐఐటీ రూర్కీ

ఐఐటీ గౌహతి

జేఎన్‌యూ ఢిల్లీ

బీహెచ్‌యూ వారణాసి

NIRF Rankings: ఇంజనీరింగ్ కేటగిరీలో టాప్‌–10

ఐఐటీ మద్రాస్

ఐఐటీ ఢిల్లీ

ఐఐటీ బాంబే

ఐఐటీ కాన్పూర్

ఐఐటీ ఖరగ్‌పూర్‌‌

ఐఐటీ రూర్కీ

ఐఐటీ గౌహతి

ఐఐటీ హైదరాబాద్

ఎన్‌ఐటీ తిరుచురాపల్లి

ఎన్‌ఐటీ సురత్‌కల్‌

NIRF Rankings: టాప్‌ –10 యూనివర్సిటీలు

ఐఐఎస్సీ బెంగళూరు

జేఎన్‌యూ ఢిల్లీ

బీహెచ్‌యూ వారణాసి

కోల్‌కత్తా యూనివర్సిటీ

అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూర్

జామియా మిలియా ఇస్లామియా న్యూఢిల్లీ

మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్‌

జాదవ్‌పూర్‌‌ యూనివర్సిటీ, కోల్‌కతా

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్

అలీగఢ్‌ ముస్లిమ్‌ యూనివర్సిటీ

NIRF Rankings: టాప్‌–5 మేనేజ్‌మెంట్ సంస్థలు

ఐఐఎం అహ్మదాబాద్‌

ఐఐఎం బెంగళూరు

ఐఐఎం కోల్‌కతా

ఐఐఎం కోజికోడ్‌

ఐఐటీ ఢిల్లీ 

NIRF Rankings: టాప్‌–5 రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌

ఐఐఎస్సీ బెంగళూరు

ఐఐటీ మద్రాస్‌

ఐఐటీ బాంబే

ఐఐటీ ఢిల్లీ

ఐఐటీ ఖరగ్‌పూర్