V6 News

ఐకేపీ వీఓఏల నిరవధిక సమ్మె.. ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం

ఐకేపీ వీఓఏల నిరవధిక సమ్మె.. ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం

కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఐకేపీ వీఓఏల ధర్నా దిగారు. తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలన్న డిమాండ్ తో మే 9వ తేదీ మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు ఐకేపీ వీఓఏలు. ప్రస్తుతం రూ.3 వేల 900 వందలు మాత్రమే గౌరవ వేతనం ఇస్తూ.. తమతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని వీఓఏ ఆరోపిస్తున్నారు. అయితే వీఓఏల సమ్మెతో ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం పడనుంది.

సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి.. రూ.10 లక్షల ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని వీవోఏలు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్న నెలకు కేవలం రూ.3,900 జీతం ఇస్తూ 30 రకాల పనులను చేయిస్తూ తీవ్ర శ్రమ దోపిడీకి పాల్పడుతుందన్నారని వీవోఏలు విమర్శించారు.