రాబోయే 5 రోజులు మస్త్ ఎండలు.... జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

రాబోయే 5 రోజులు మస్త్ ఎండలు....  జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

తెలంగాణకు  వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఈ నేపథ్యంలో తీవ్రమైన వడగాల్పులు వీచే ప్రమాదం ఉన్నందున... ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ జిల్లాలకు కూడా అధికారులు అలర్ట్ జారీ చేశారు. ప్రజలు మధ్యాహ్నం పూట అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.

అయితే, మరోవైపు ఎండల తీవ్రత ఇలా ఉన్నప్పటికీ... రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ, రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.