ఆకట్టుకుంటున్న "థాంక్యూ" ట్రైలర్

ఆకట్టుకుంటున్న "థాంక్యూ" ట్రైలర్

 ఒక మనిషిని పట్టుకుని వేలాడే ప్రేమ కంటే.. స్వేచ్చగా వదిలేయగలిగే ప్రేమే ఎంతో గొప్పదంటున్నాడు అక్కినేని నాగ చైతన్య. లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల తర్వాత నాగ చైతన్య నటించిన చిత్రం థాంక్యూ.  విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో  దిల్ రాజు నిర్మించిన ఈ మూవీలో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించారు.  ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్  ఆకట్టుకోగా.. తాజాగా థాంక్యూ ట్రైలర్ విడుదలైంది. 

ట్రైలర్లో నాగచైతన్య మూడు డిఫ్రెంట్ స్టేజిల్లో లైఫ్ జర్నీని చూపించారు. తన జీవితంలో ఉన్నతస్థానానికి చేరుకున్న తర్వాత...అందుకు కారణమైన వారికి థాంక్యూ చెప్పేందుకు హీరో వెళ్తాడు. ఈ జర్నీయే థాంక్యూ స్టోరీ అన్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య చెప్పే ఎమోషనల్ డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. మనం ఎక్కడ మొదలయ్యామో మరిచిపోతే.. మనం చేరిన గమ్యానికి విలువ ఉండదు. లుక్ బ్యాక్ అభి.... నీ సక్సెస్ కు  కారణమైన వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారని  అనే డైలాగులు కూడా బాగున్నాయి.  మొత్తంగా  విజువల్స్, రొమాన్స్, యాక్షన్, డైలాగ్స్ ప్రతీ విభాగంలో థాంక్యూ  ట్రైలర్ ఆకట్టుకుంటుందని చెప్పాలి. 

థాంక్యూ చిత్రానికి బీవీఎస్ రవి స్టోరీ అందించగా... తమన్ సంగీతం సమకూర్చాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జులై 22న ఈ చిత్రం వరల్డ్ వైడ్గా విడుదల కానుంది.