ఈ చెత్త డేంజర్​ : మోడీ

ఈ చెత్త డేంజర్​ : మోడీ

మన్​కీ బాత్​లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ : ఇప్పుడు కొత్తగా ఉన్న గాడ్జెట్లే తర్వాత ఈ–చెత్త​గా మారతాయని, కొత్తవి కొన్నప్పుడు పాతవాటిని సరైన పద్ధతిలో వదిలించుకోవాలని, లేదంటే పర్యావరణం దెబ్బతింటుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. కొత్త సంవత్సరంలో తొలి ‘మన్​కీ బాత్’ ​ఎపిసోడ్​లో ఆదివారం మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. యూఎన్ లెక్కల ప్రకారం ఏటా 50 మిలియన్‌ టన్నుల ఈ–చెత్త​తయారవుతోందని, ప్రతి సెకనుకు 800 ల్యాప్​టాప్​లు విసిరిపారేస్తున్నారని, ఈ–చెత్త​​ మేనేజ్​మెంట్​ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అనర్థమేనని హెచ్చరించారు. కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తూ కొన్ని స్టార్టప్​లు గ్లోబల్​ రీసైక్లింగ్​హబ్​గా మనదేశాన్ని మారుస్తున్నాయని, ఇన్నోవేషన్​తో వర్క్ చేసే స్టార్టప్​లకు మరణం అనేదే ఉండదని చెప్పారు. చిత్తడి నేలలకు అంతర్జాతీయ గుర్తింపుగా ఉన్న రామ్‌సర్ సైట్ల సంఖ్య 2014లో 26 ఉంటే ఇప్పుడు అది 75కి పెరిగిందని, జీవవైవిధ్యాన్ని కాపాడుతున్న స్థానిక ప్రజలకే ఈ ఘటన దక్కుతుందని ప్రశంసించారు.

ఇది పీపుల్స్ పద్మ సంవత్సరం..

2023ను ‘పీపుల్స్‌ పద్మ’ సంవత్సరంగా ప్రధాని అభివర్ణించారు. ఆదివాసీలు, సమాజ సేవకులు, సంగీత ప్రపంచం కోసం పని చేసిన వారికి ఈసారి పద్మ అవార్డుల్లో ప్రాధాన్యం దక్కిందన్నారు. ‘అవార్డులు దక్కిన వారిలో చాలామంది ఈ దేశాన్ని ఉన్నత శిఖరాలపై నిలిపారు. దేశమే ముందు అనే సూత్రానికి తమ జీవితాలను అంకితం చేశారు. నమ్మిన సిద్ధాంతం, చేస్తున్న పనిలో దొరుకుతున్న సంతృప్తి వారికి దక్కిన అతి పెద్ద అవార్డు. అలాంటి వారిని సత్కరించడం మనందరికీ గర్వకారణం’ అని మోడీ అన్నారు. కాగా, మన దేశ టెక్నాలజీలు.. ఈ శతాబ్దాన్ని (డికేడ్) డామినేట్​ చేయాలని, ఇండియా కల అయిన టెకేడ్(టెక్నాలజీ+డికేడ్)​ను నిజం చేసే బాధ్యత ఇన్నోవేటర్ల శక్తిసామర్థ్యాలపైనే ఆధారపడి ఉందని ప్రధాని అన్నారు. పేటెంట్ల ఫైలింగ్​ విషయంలో మనదేశం గ్లోబల్​గా ఏడో స్థానంలో ఉందని మోడీ చెప్పారు.

ఇండియా.. ప్రజాస్వామ్యానికి అమ్మ

‘ఇండియా–ద మదర్​ ఆఫ్ డెమోక్రసీ’ బుక్​ గురించి మాట్లాడుతూ.. మన నరనరాల్లోనూ, సంస్కృతిలోనూ ప్రజాస్వామ్యం ఉందని, అందుకే మనదేశం ప్రజాస్వామ్యానికి అమ్మలాంటిద ని మోడీ చెప్పారు. ఎన్నో దశాబ్దాలుగా మన పనిలో ప్రజాస్వామ్యం అనేది అంతర్భాగంగా ఉందని, స్వభావరీత్యా మనది ప్రజాస్వామ్య సమాజమని అన్నారు. యోగా, చిరుధాన్యాలకు గ్లోబల్​గా ఆమోదం లభిస్తోందని, జూన్ 21ని ఇంటర్నేషనల్​ యోగా డే యూఎన్​ ఆమోదించిం దని, ఈ ఏడాది ఇంటర్నేషనల్​ ఇయర్​ ఆఫ్  మిల్లెట్స్​ గా ప్రకటించిందని చెప్పారు.