మద్యపాన నియంత్రణ కోసమే ధరల పెంపు: సీఎం జగన్

మద్యపాన నియంత్రణ కోసమే ధరల పెంపు: సీఎం జగన్

మద్యపానాన్ని అరికట్టడంలో భాగంగానే భారీగా  లిక్కర్ రేట్లను పెంచినట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. దశల వారీగా మద్యపానాన్ని నిషేధించడమే తమ ప్రభుత్వ  టార్గెట్ అన్నారు. అందులో భాగంగానే లిక్కర్ రేట్లను 75శాతం అదనంగా పెంచామన్నారు. అంతేకాదు అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు సీఎం జగన్ . మద్యపాన నిషేధానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. దశల వారీ మద్యపాన నిషేధంలో భాగంగా 43 వేల బెల్ట్ షాపులను రద్ద చేశామని, 20 శాతం షాపులను తగ్గించామని తెలిపారు. త్వరలో మరో 13 శాతం షాపులను తగ్గిస్తామని చెప్పారు. మద్య పానాన్ని నిరుత్సాహపరచాలనే ఉద్దేశ్యంతో 25 శాతం రెట్లు పెంచామని, అయితే ఢిల్లీ ప్రభుత్వం ఏకంగా 70 శాతం రెట్లు పెంచిందని, దీంతో తాము కూడా 75 శాతం రెట్లు పెంచామని చెప్పారు సీఎం జగన్. ప్రతి షాపు దగ్గర అంతకు ముందు ప్రైవేట్  రూమ్స్‌ ఉండేవని, వాటిని కూడా రద్దు చేశామన్నారు.

మద్యపాన నియంత్రణలో భాగంగా షాపులు తెరిచి ఉంచే సమయాన్ని ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకే పరిమితం చేశామని తెలిపారు. దీంతో ఇతర రాష్ట్రాల నుండి వచ్చే అక్రమ మద్యంపైన గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు సీఎం జగన్.