కొలంబో: టీమిండియాతో ఈ నెల 24న ప్రారంభంకానున్న టీ20 సిరీస్ కు శ్రీలంక క్రికెట్ బోర్డు సోమవారం టీమ్ ను ప్రకటించింది. మొత్తం 18 మందితో కూడిన ఈ టీమ్ లో ఇంటర్నేషనల్ డెబ్యూ కోసం ఎదురుచూస్తున్న ఆఫ్ స్పిన్నర్ అషియన్ డానియల్ కు చోటిచ్చింది. కానీ అతనికి స్పోర్ట్స్ మినిస్ట్రీ నుంచి అప్రూవల్ లభించాల్సి ఉందని తెలిపింది. ఆల్‌రౌండర్ దసున్ షనక కెప్టెన్‌గా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో పాల్గొన్న టీమ్ ను దాదాపుగా తిరిగి ఎంపిక చేసింది. అయితే గాయాల కారణంగా బ్యాటర్ అవిష్క ఫెర్నాండో, సీమర్ నువాన్ తుషారా, స్పిన్నర్ రమేశ్ మెండిస్ ఈ సిరీస్ కు అందుబాటులో ఉండటం లేదని బోర్డు పేర్కొంది. సరైన ఫిట్‌నెస్ లేదంటూ ఫామ్‌లో ఉన్న మిడిలార్డర్ బ్యాటర్ భానుక రాజపక్సకు మరోసారి సెలెక్టర్లు మొండిచేయి చూపారు. మూడు టీ20ల ఈ సిరీస్ ఫస్ట్ మ్యాచ్ లక్నోలో జరగనుండగా, 26, 27న జరిగే రెండు మ్యాచ్ లకు ధర్మశాల వేదిక కానుంది. శ్రీలంక టీ20 టీమ్: దసున్ షనక (కెప్టెన్), నిసాంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), చండిమల్, దనుష్క గుణతిలక, కమిల్ మిషార, జనిత్ లియనగె, వానిందు హసరంగ, చమిక కరుణరత్నె, చమీర, లహిరు కుమార, బినుర ఫెర్నాండో, షిరాన్ ఫెర్నాండో, మహీశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్ జయవిక్రమ, అషియన్ డానియల్ (మంత్రివర్గ ఆమోదం లభిస్తే).

