బుమ్రా ఫిట్.. శ్రీలంక టూర్‌కు రెడీ.. టీమిండియాకు బిగ్ బూస్ట్!

బుమ్రా ఫిట్.. శ్రీలంక టూర్‌కు రెడీ.. టీమిండియాకు బిగ్ బూస్ట్!

Jasprit Bumrah: వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు బిగ్ రిలీఫ్ లభించంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) ధృవీకరించింది. ఇంగ్లాండ్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో దెబ్బ తగలడంతో మూడో వన్డేకి దూరమైన బుమ్రా, ఫిట్‌నెస్‌కు లోబడి శ్రీలంక టెస్ట్ జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే.

సీఓఈ టెస్టుల్లో బుమ్రా పాస్.. బీసీసీఐ స్పష్టత: 
బెంగళూరు సీఓఈలోని వైద్య బృందం నిర్వహించిన అన్ని నిర్బంధ ఫ్లోర్, ఫిట్‌నెస్ పరీక్షలను బుమ్రా విజయవంతంగా పూర్తి చేసుకున్నాడని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. బుమ్రా తన గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. సీఓఈ విధించిన ఫిట్‌నెస్ టెస్టులన్నింటినీ క్లియర్ చేశాడు. రాబోయే రెండు టెస్టుల్లోనూ ఆయన అందుబాటులో ఉంటాడని భావిస్తున్నాం.. జట్టు వ్యూహాల్లో బుమ్రా అత్యంత కీలకమైన ఆటగాడని సదరు అధికారి తెలిపారు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) రేసులో కీలకం: 
భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్ ఆగస్టు 15వ తేదీన ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 23 నుంచి కొలంబోలో జరగనుంది. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన 9 టెస్టుల్లో భారత్ కనీసం 7 మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది. అందువల్ల లంక గడ్డపై 2–0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేయడం భారత్ కి చాలా ముఖ్యం. 

ALSO READ : నాకు చెప్పకుండానే కాషాయం జెర్సీపై నిర్ణయం తీసుకున్నారు

గాయాల కలకలం వేళ తీపి కబురు: 
ప్రస్తుతం భారత జట్టును గాయాల సమస్య వెంటాడుతున్న వేళ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనం జట్టుకు కొండంత బలాన్నిచ్చింది. పేసర్లు హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డిలు ఇప్పటికే తొడ కండరాల గాయాలతో సిరీస్‌కు దూరం కాగా, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మొదటి టెస్టుకు దూరమయ్యాడు. మరో పేసర్ ఆకాష్ దీప్ కూడా వీపు గాయంతో కోలుకుంటున్న నేపథ్యంలో బుమ్రా రాక భారత బౌలింగ్ విభాగానికి ప్రధాన బలంగా మారింది.