Hockey India Jersey Row: అంతర్జాతీయ హాకీ వరల్డ్ కప్ సమయంలో భారత హాకీ జట్టు జెర్సీ రంగును బ్లూ నుంచి కాషాయం (సఫ్రాన్)కు మార్చడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలు, పాటించిన విధానంపై హాకీ ఇండియా ప్రెసిడెంట్ దిలీప్ తిర్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మార్పు గురించి తనకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ఎగ్జిక్యూటివ్ బోర్డులో కూడా చర్చించలేదని అధికారులకు రాసిన ఈమెయిల్‌లో ఆయన తేల్చి చెప్పారు.
రంగుపై కాదు.. ప్రక్రియపైనే నా అభ్యంతరం:
హాకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులకు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు రాసిన లేఖలో దిలీప్ తిర్కీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నిర్ణయం తన ముందస్తు అనుమతి లేకుండా, ఎగ్జిక్యూటివ్ బోర్డులో చర్చించకుండా ఏకపక్షంగా తీసుకున్నారని ఆరోపించారు. కాషాయ రంగుపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ జాతీయ జట్టు గుర్తింపును మార్చేటప్పుడు ఎన్నుకోబడిన పాలకమండలిని సంప్రదించకపోవడంపైనే తన ఆందోళన అన్నాడు.
ఒడిశా ప్రభుత్వం నోటీసులు.. అధికారులకు డెడ్‌లైన్:
ఈ జెర్సీ మార్పు తీవ్ర విమర్శలకు దారి తీయడంతో ఒడిశా ప్రభుత్వం కూడా దీనిపై వివరణ కోరుతూ హాకీ ఇండియా ప్రెసిడెంట్ దిలీప్ తిర్కీకి లేఖ రాసింది. దీనిపై స్పందించిన అతడు, హాకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు (శుక్రవారం, జులై 31వ) సాయంత్రం 5 గంటలలోపు ఈ మార్పు వెనుక ఉన్న హేతుబద్ధత, ఏ అధికార పరిధి కింద ఈ నిర్ణయం తీసుకున్నారు అని అడిగింది.
బ్లూ టర్ఫ్ విజిబిలిటీ vs పొలిటికల్ వివాదం:
అంతకుముందు మీడియా సమావేశంలో దిలీప్ తిర్కీ మాట్లాడుతూ.. ఐహెచ్ఎఫ్ (FIH) మైదానాల్లో బ్లూ సింథటిక్ టర్ఫ్ ఉండటంతో నీలం రంగు జెర్సీలు వేసుకున్నప్పుడు ఆటగాళ్ల విజిబిలిటీ దెబ్బతింటోంది, అందుకే ఆటగాళ్లు, కోచ్‌ల సూచనతోనే రంగు మార్చామని సమర్థించుకున్నారు. అయితే మాజీ కెప్టెన్ విరేన్ రస్కిన్హా, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సహా పలువురు ప్రముఖులు భారత హాకీకి ఉన్న చారిత్రక బ్లూ ఐడెంటిటీని దెబ్బతీశారని విమర్శించడంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పుడు స్వయంగా ప్రెసిడెంట్ కూడా అంతర్గత పారదర్శకతను ప్రశ్నించడంతో హాకీ ఇండియా యంత్రాంగం తీవ్ర ఒత్తిడిలో పడింది.
Dilip Tirkey Seeks Explanation Over Hockey India Jersey Change pic.twitter.com/9K6xGF4b8w
— Soumyajit Pattnaik (@soumyajitt) July 31, 2026
