విండీస్ పై భారత్ గ్రాండ్ విక్టరీ..టెస్టు సిరీస్ మనదే

విండీస్ పై భారత్ గ్రాండ్ విక్టరీ..టెస్టు సిరీస్ మనదే

వెస్టీండీస్ పర్యటనను విజయవంతంగా ముగించింది భారత్. ఇప్పటికే టీ20, వన్డే సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. రెండో టెస్టులో 257 పరుగుల తేడాతో విజయం సాధించి టెస్టు సిరీస్ ను కూడా 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. 468 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన విండీస్ రెండో ఇన్నింగ్స్ లో 210 పరుగులకే  ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు షమీ,జడేజా చెరో మూడు వికెట్లు,ఇషాంత్ రెచ్చిపోవడంతో విండీస్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేసారు. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్  416 పరుగులు, వెస్టిండీస్ 117, భారత్ రెండో ఇన్సింగ్స్ 168/4 డిక్లేర్, విండీస్ రెండో ఇన్నింగ్స్ 210 ఆలౌట్ అయ్యింది. టెస్టు సిరీస్ ను 2-0 క్లీన్ స్వీప్ చేయడంతో టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భారత్ 120 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది.

 కోహ్లీ మరో రికార్డ్..

వెస్టీండీస్ తో రెండు టెస్టులు గెలిచిన కోహ్లీ అత్యధిక టెస్టులు గెలిచిన భారత కెప్టెన్ గా రికార్డ్ సృష్టించాడు. ఇప్పటి వరకు 60 టెస్టుల్లో 27 మ్యాచులను గెలిపించి ధోని ఫస్ట్ ప్లేసులో ఉన్నాడు. లేటెస్ట్ గా విండీస్ తో రెండో టెస్టు గెలవడంతో కోహ్లీ 28 టెస్టు విజయాలను అందించిన భారత కెప్టెన్ గా రికార్డ్ సృష్టించాడు.  కోహ్లీ కెప్టెన్సీలో 48 టెస్టు మ్యాచ్ లు ఆడగా .. 28 విజయాలు, 10 డ్రా,10 ఓటమి పాలయ్యాయి.