TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల

TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల

తెలంగాణ టెట్ (TS TET 2024) పరీక్షల హాల్‌టికెట్లు విడుదల చేసింది విద్యాశాఖ. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు మే 20వ తేదీ నుంచి TS TET 2024 పరీక్షలు జరుగనున్నాయి. మే 20వ తేదీ నుంచి జూన్‌ 2వ తేదీ వరకు టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. తొలిసారిగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పద్ధతి సీబీటీ)లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో TS TET 2024 పరీక్షలు జరుగుతాయి. TS TET Hall Ticket 2024 డౌన్‌లోడ్‌ లింక్‌ https://tstet2024.aptonline.in/tstet/ Hallticket Front  క్లిక్‌ చేసి డౌన్ లోడ్ చేసుకోవాచ్చు. 

2024 టెట్‌ పరీక్షకు 2.86 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌ పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ రాయడానికి అర్హులు.టెట్‌ పేపర్‌-1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్‌లో జనరల్‌ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీలో చేసిఉంటే జనరల్‌ అభ్యర్థులకు ఇంటర్‌లో 45 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే. టెట్‌ పేపర్‌-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి.