లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్‌వో అరెస్టు

లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్‌వో అరెస్టు

లైంగిక వేధింపుల ఆరోపణలపై కామారెడ్డి డీఎంహెచ్‌వోను పోలీసులు అరెస్టు చేశారు.  . వైద్యాధికారిణులు వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు దేవునిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఏడు కేసులు నమోదు చేసిన పోలీసులు.. విచారణ అనంతరం ఆయన్ను అరెస్టు చేశారు.  డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్‌ను అరెస్టు చేసి అనంతరం కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. అనంతరం బెయిల్‌పై లక్ష్మణ్‌సింగ్‌ రిలీజయ్యారు.   లక్ష్మణ్‌ సింగ్‌ తమను ఏడాదిన్నర కాలంగా లైంగికంగా వేధిస్తున్నట్లుగా ఇటీవల  వైద్యాధికారిణులు ఆరోపించారు.  వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు  పలు సెక్షన్ల కింద మంగళవారం ఐదు కేసులు, బుధవారం మరో రెండు కేసులు నమోదు చేశారు.