విద్యుత్  షాక్ తో జీపీ సెక్రటరీ మృతి.. ఖమ్మం జిల్లా కారేపల్లి  మండలంలో ఘటన

విద్యుత్  షాక్ తో జీపీ సెక్రటరీ మృతి.. ఖమ్మం జిల్లా కారేపల్లి  మండలంలో ఘటన

కారేపల్లి, వెలుగు: విద్యుత్  షాక్ తో గ్రామపంచాయతీ కార్యదర్శి చనిపోయాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గోవింద్రాల గ్రామానికి చెందిన లకావత్  సురేశ్(32) ఏన్కూరు మండలం తిమ్మారావుపేట గ్రామపంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. సురేశ్​ అత్తగారి గ్రామమైన కారేపల్లి మండలం మంగలితండాలో ఉంటూ తిమ్మారావుపేటలో డ్యూటీ చేస్తున్నాడు. ఆదివారం ఇంటిలో ఉన్న ఇన్వర్టర్ ను పక్క గదిలోకి తరలిస్తుండగా, విద్యుత్  షాక్ కు గురై చనిపోయాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.