Oscar Awards: 98వ ఆస్కార్ అవార్డులు: సత్తా చాటిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్.. ఫుల్ లిస్ట్ ఇదే !

Oscar Awards: 98వ ఆస్కార్ అవార్డులు: సత్తా చాటిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్.. ఫుల్ లిస్ట్ ఇదే !

ప్రపంచ సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సం అట్టహాసంగా జరిగింది. 98వ అకాడెమీ అవార్డ్స్ వేడుకల్లో హాలీవుడ్ తో పాటు వివిధ దేశాల సినీ స్టార్స్ సందడి చేశారు. ఇండియా నుంచి  ప్రియాంక చోప్రా అకాడెమీ స్టేజ్ పై ప్రజెంటర్ గా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. 

వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ :

98వ అవార్డ్స్  లిస్టులో హాలీవుడ్ మూవీ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సత్తా చాటింది. ఏకంగా ఆరు అవార్డులతో టాప్ లో నిలిచింది. ఈ సినిమాను  డైరెక్టర్ పాల్ థామస్ ఆండర్సన్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు. దీంతో పాటు ఈ సినిమాకు బెస్ట్ పిక్చర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిలిం ఎడిటింగ్, బెస్ట్ క్యాస్టింగ్ కింద ఆరు అవార్డులు గెలుచుకుని టాప్ లో నిలిచింది.  ఆ తర్వాత సిన్నర్స్ మూవీకి నాలుగు అవార్డులు వచ్చాయి.

సిన్నర్స్:

సిన్నర్స్ మూవీ నాలుగు అవార్డులను గెలుచుకుంది. బెస్ట్ యాక్టర్ గా మిచెల్ బి.జోర్డాన్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కో్ర్ విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. 

Oscars 2026 – ఫుల్ లిస్ట్:

  • ఉత్తమ చిత్రం: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
  • ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ ఆండర్సన్ - వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
  • ఉత్తమ నటుడు: మిచెల్ బి.జోర్డాన్, సిన్నర్స్
  • ఉత్తమ నటి: జెసీ బక్లీ – హామ్‌నెట్
  • ఉత్తమ సహాయ నటుడు: షాన్ పెన్ –  వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
  • ఉత్తమ సహాయ నటి: ఏమీ మాడిగన్– వెపన్స్

 స్క్రీన్‌ప్లే అవార్డ్స్:

  • బెస్ట్ ఒరిజిన స్క్రీన్‌ప్లే: పాపులు – ర్యాన్ కూగ్లర్
  • ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ –సిన్నర్స్, ర్యాన్ కూగ్లర్

టెక్నికల్, క్రియేటివ్ అవార్డ్స్:

  • బెస్ట్ సినిమాటోగ్రఫీ: సిన్నర్స్– ఆటం డ్యూరాల్డ్ అర్కాపా
  • బెస్ట్  ఎడిటింగ్: - వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ – ఆండీ జుర్గెన్సెన్
  • బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్:ఫ్రాంకెన్‌స్టైన్
  • కాస్ట్యూమ్స్: ఫ్రాంకెన్‌స్టైన్ – కేట్ హాలీ
  • విజువల్ ఎఫెక్ట్స్: అవతార్: ఫైర్ అండ్ యాష్
  • బెస్ట్ సౌండ్ (Sound): F1
  • ఉత్తమ కాస్టింగ్: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ – కాసాండ్రా కులుకుండిస్
  • మ్యూజికల్ అవార్డ్స్:
  • బెస్ట్ ఒరిజినల్ స్కోర్: సిన్నర్స్ – లుడ్విగ్ గోరాన్సన్
  • ఉత్తమ పాట: గోల్డెన్ – K-Pop  డెమాన్ హంటర్స్

ఇంటర్నేషనల్  & డాక్యుమెంటరీ

  • ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: సెంటిమెంటల్ వ్యాల్యూ (నార్వే)
  • ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: మిస్టర్. నోబడీ అగెనిస్ట్ పుతిన్
  • ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం: ఆల్ ద ఎంప్టీ రూమ్స్

 యానిమేషన్ పురస్కారాలు:

  • ఉత్తమ యానిమేషన్ చిత్రం: కెపాప్  డెమాన్ హంటర్స్
  • ఉత్తమ యానిమేషన్ షార్ట్ ఫిలిం: ద గర్ల్ హూ క్రైడ్ పెరల్స్

షార్ట్ ఫిలిమ్స్:

  • ఉత్తమ లైవ్-యాక్షన్ షార్ట్ ఫిలిం: ద సింగర్స్ 

ఇండియా నుంచి నామినేట్ అయిన సినిమాలు:

భారతీయ సినిమాలు ఈ సారి నిరాశపర్చాయనే చెప్పలలి. గీతా గబ్బర్ తీసిన రెండు సినిమాలు నామినేట్ అయినప్పటికీ అవార్డు దక్కలేదు. 

  • బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ : ద పర్ఫెక్ట్ నెయిబర్
  • బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం : ద డెవిల్ ఈ జ్ బిజీ  

సినిమాలు నామినేట్ అయ్యాయి. ఒకే ఏడాదిలో రెండు డాక్యుమెంటరీ చిత్రాలు నామినేట్ అయిన ఇండియా మహిళా డైరెక్టర్ గీతా గబ్బర్ కావడం విశేషం.