ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక: 2 రోజుల్లో 15 టన్నుల ఈ వేస్ట్సేకరణ

ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక: 2 రోజుల్లో 15 టన్నుల ఈ వేస్ట్సేకరణ

హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్​ పరిధిలో ఈ వేస్ట్​సేకరణకు స్పందన లభిస్తోంది. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా 2 రోజులుగా నిర్వహిస్తున్న ఈ-–వేస్ట్ మెగా కలెక్షన్ డ్రైవ్ ద్వారా 30 సర్కిళ్లలో కలిపి 15 వేల కిలోల ఈ -వేస్ట్ సేకరించినట్టు అధికారులు తెలిపారు. 110 కేంద్రాల్లో పాత మొబైల్ ఫోన్లు, ల్యాప్‌‌టాప్‌‌లు, ఛార్జర్లు, కీబోర్డులు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించామన్నారు. జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలోని జలగం వెంగళరావు పార్క్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో 450 కిలోల ఈ- వేస్ట్ ,  కవాడిగూడ సర్కిల్​పరిధిలోని ఇందిరా పార్క్ వద్ద 510 కిలోల ఈ-వేస్ట్ సేకరించి రివార్డు అందజేశారు.