- గాయానికి సర్జరీ అవసరం లేదు
- బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్
చెన్నై: వెన్నునొప్పితో బాధపడుతున్న టీమిండియా స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా షెడ్యూల్ కంటే ముందుగానే మళ్లీ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. బుమ్రా గాయానికి సర్జరీ కూడా అవసరం లేదని ఇండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తెలిపాడు. ఎన్‌సీఏ చీఫ్ ఫిజియో ఆశిష్ కౌశిక్‌తో కలిసి లండన్ వెళ్లిన బుమ్రా.. అక్కడి స్పెషలిస్ట్‌లను కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పాడు. జనవరిలో మొదలయ్యే న్యూజిలాండ్ టూర్ కల్లా జస్‌ప్రీత్ పూర్తిగా కోలుకుంటాడని అరుణ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. జనవరి 24న ఈ టూర్ మొదలవనుంది. లండన్ వైద్యుల పర్యవేక్షణలో గాయం నుంచి కోలుకుంటున్న బ్రుమా ఇప్పటికే రన్నింగ్ చేయడంతో పాటు వామప్ ఎక్సర్‌సైజులు కూడా చేస్తున్నాడు. దీపావళి తర్వాత టీమిండియా ఫిజియో నితిన్ పటేల్ ఆధ్వర్యంలో ఎన్‌సీఏలో బుమ్రా పురోగతిని పరీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది.


