హెల్త్‌‌కేర్‌‌‌‌లో ఇండియా గ్లోబల్‌‌ లీడర్ కావాలి

హెల్త్‌‌కేర్‌‌‌‌లో ఇండియా గ్లోబల్‌‌ లీడర్ కావాలి

ఆస్కీ 65వ ఫౌండేషన్ డే స్పీచ్‌‌లో గవర్నర్ తమిళి సై

హైదరాబాద్, వెలుగు: హెల్త్ కేర్ రంగంలో ప్రపంచశక్తిగా ఎదగడానికి ఇండియాకు అవకాశాలు ఉన్నాయని గవర్నర్ తమిళి సై అన్నారు. నిధులు, పెట్టుబడులు పెంచడం, కొత్త టెక్నాలజీని సరిగ్గా వినియోగించు కోవడం, ప్రమాణాల పెంపుతో గ్లోబల్ పవర్ హౌస్‌‌గా ఎదగొచ్చన్నా రు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) 65వ ఫౌండేషన్ డే కార్యక్రమంలో గవర్నర్ వర్చువల్‌‌గా పాల్గొన్నారు. ఫార్మసీ రంగం ప్రపంచంలోనే ముఖ్యమైన స్థానంలో ఉందని, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్‌‌ (ఏపీఐ) తయారీలో స్వయం సమృద్ధి సాధించాలని తమిళి సై పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజీలను పెంచుకోవడంతో పాటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పాటించినప్పుడే మరింతమంది మెడికల్ టూరిస్టులను మనదేశం అట్రాక్ట్ చేయగలదని తెలిపారు.