చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్

చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు  ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా చింతమడక  కేవీఆర్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనీ 13వ పోలింగ్ భూత్ లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తన సతీమణి శోభమ్మతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

హైదరాబాద్  నందినగర్‌లో కుటుంబసభ్యులతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్‌ ఓటు వేశారు.  సిద్దిపేటలోని అంబిటస్‌ స్కూల్‌లో తన సతీమణితో కలిసి ఓటు వేశారు హరీశ్ రావు.