పెద్దపల్లి పార్లమెంట్ లో 11 గంటల్లోపు 26.33 శాతం పోలింగ్

పెద్దపల్లి పార్లమెంట్ లో 11 గంటల్లోపు 26.33 శాతం పోలింగ్

తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి ఉదయం 11 గంటల వరకు 26.33 శాతం పోలింగ్ నమోదైంది.  

  • పెద్దపల్లి నియోజకవర్గం: 25.57 %
  • మంథని నియోజకవర్గం : 27.41 % 
  • రామగుండం నియోజకవర్గం: 21.46 % 
  • చెన్నూరు నియోజకవర్గం: 26.35 % 
  • బెల్లంపల్లి నియోజకవర్గం: 30.52% 
  • మంచిర్యాల నియోజకవర్గం: 24.87%
  • ధర్మపురి నియోజకవర్గం: 28.11%