జనగామలో పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత

జనగామలో పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత

జనగామ జిల్లాలోని గానుగపహాడ్ గ్రామంలో పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ బూత్ కు ఓటేసేందుకు వచ్చిన ఓటర్లు పోలీసులు కొట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఓటేసేందుకు వెళ్లిన తమపై లాఠీఛార్జ్ చేశారని మండిపడ్డారు. గుంపుగా ఉన్నందుకే వారిని హెచ్చరించామని పోలీసులు చెబుతున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.