యూపీ స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీడింగ్‌‌‌‌‌‌‌‌ తప్పనిసరి..పిల్లల్లో స్క్రీన్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ తగ్గించేలా సర్కారు నిర్ణయం

యూపీ స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీడింగ్‌‌‌‌‌‌‌‌ తప్పనిసరి..పిల్లల్లో స్క్రీన్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ తగ్గించేలా సర్కారు నిర్ణయం
  • పిల్లల్లో స్క్రీన్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ తగ్గించేలా, ఏకాగ్రత పెంచేలా సర్కారు నిర్ణయం

లక్నో: ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సెకండరీ, ప్రైమరీ స్కూల్స్‌‌‌‌‌‌‌‌లో విద్యార్థులకు న్యూస్‌‌‌‌‌‌‌‌ పేపర్ పఠనాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

విద్యార్థుల్లో పఠన సంస్కృతిని పెంచడం, అధిక స్క్రీన్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ని తగ్గించడం కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తెలిపింది.

 ఈ మేరకు స్కూల్‌‌‌‌‌‌‌‌ లైబ్రరీలో హిందీ, ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌ న్యూస్‌‌‌‌‌‌‌‌ పేపర్లు అందుబాటులో ఉంచాలని శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉదయం స్కూల్ అసెంబ్లీలో న్యూస్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చదివేందుకు కనీసం 10 నిమిషాలు కేటాయించాలని ఆదేశించింది.