సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కొడుకు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ సమర్పణలో చంద మామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది.
తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో కీలక సన్నివేశాలతో పాటు పాటలు చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌లో ముప్ఫై శాతం వరకూ చిత్రీకరణ జరిగిందని, ఇప్పటివరకూ వచ్చిన అవుట్‌పుట్‌తో సంతృప్తిగా ఉన్నామని నిర్మాతలు తెలియజేశారు. ఈ ఉత్సాహంతో త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. నెక్స్ట్ షెడ్యూల్ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుంది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
