శంబాలకు హౌస్‌‌‌‌ఫుల్ బోర్డులు పడటం హ్యాపీ

శంబాలకు హౌస్‌‌‌‌ఫుల్  బోర్డులు పడటం హ్యాపీ

‘శంబాల’ చిత్రానికొస్తున్న  రెస్పాన్స్ చాలా సంతోషాన్ని  ఇస్తోందని దర్శకుడు యుగంధర్ ముని చెప్పాడు. ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జంటగా   మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు కలిసి నిర్మించిన ఈ మూవీ గురువారం విడుదలై  పాజిటివ్ టాక్‌‌‌‌ తెచ్చుకుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ యుగంధర్ ముని మాట్లాడుతూ ‘దర్శకుడిగా ఈ కథను ఎంతో బాధ్యతతో రాసుకున్నా.  సైన్స్, శాస్త్రాన్ని  బాలెన్స్ చేయాలని, ఎవ్వరి మనోభావాల్ని దెబ్బ తీయకూడదని ముందే అనుకున్నా. ఊహించినట్టే సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

పలు  చోట్ల  హౌస్‌‌‌‌ఫుల్ బోర్డులు కూడా పడ్డాయి. ఆంధ్ర, తెలంగా ణతోపాటు  తమిళనాడు, కర్ణాటకలోనూ మంచి స్పందన వస్తోంది. ఇండస్ట్రీ నుంచి చాలా మంది  హీరోలు, దర్శక, నిర్మాతలు  ఫోన్స్ చేసి అభినందిస్తున్నారు. ఈ కథకు ఆది వందశాతం న్యాయం చేశారు. ఆర్టిస్టులంతా చాలా సపోర్ట్ చేశారు. బడ్జెట్ పెరిగినా ప్రొడ్యూ సర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. దీంతో అవుట్‌‌‌‌పుట్ బాగా వచ్చింది.  నాకు సూపర్ నేచురల్, థ్రిల్లర్ జానర్‌‌‌‌లంటేనే ఎక్కువగా ఇష్టం. ప్రస్తుతం షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌లోనే ఓ సినిమా చేయబోతున్నా’ అని చెప్పాడు.