అనగనగా ఒకరాజు నుంచి రెండో సాంగ్

అనగనగా ఒకరాజు  నుంచి రెండో సాంగ్

నవీన్  పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా దర్శకుడు మారి రూపొందిస్తున్న చిత్రం ‘అనగనగా ఒకరాజు’.   సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.   

సంక్రాంతి సందర్భంగా  జనవరి 14న  సినిమా విడుదల కానుంది. ఇప్పటికే  మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. రీసెంట్‌‌‌‌గా ఫస్ట్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం రెండో పాటను విడుదల చేశారు.   ‘రాజుగారి పెళ్లిరో’ అంటూ మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన ఈ వెడ్డింగ్ సాంగ్ కలర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌గా సాగింది.  ‘టాలీవుడ్ డీజే కొట్టు.. బాలీవుడ్ బట్టలు కట్టు.. హాలీవుడ్ బడ్జెట్ పెట్టు..  ’ అంటూ చంద్రబోస్ క్యాచీ లిరిక్స్ రాయగా, అనురాగ్ కులకర్ణి, సమీర భరద్వాజ కలిసి పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో  నవీన్, మీనాక్షి చేసిన డ్యాన్స్ మూమెంట్స్, కలర్‌‌‌‌‌‌‌‌ఫుల్ విజువల్స్   ఆకట్టుకున్నాయి.