‘ఛాంపియన్’ తమకు చాలా స్పెషల్ ఫిల్మ్ అని, మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థ్యాంక్స్ చెప్పింది టీమ్. రోషన్, అనస్వర రాజన్ జంటగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, స్వప్న ఫిల్మ్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదలైంది.
ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోందని మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ ‘ఈ ప్రాజెక్టుకి నేను ఎమోషనల్ గా అటాచ్ అయ్యాను. విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని చెప్పాడు. తాను పోషించిన చంద్రకళ పాత్రకు మంచి అప్లాజ్ రావడం హ్యాపీ అంది అనసర్వ రాజన్.
ఇది మన నేల చరిత్ర అని, ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్స్ చెప్పాడు దర్శకుడు ప్రదీప్ . ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయని, ఇంత ఆదరణ చూపిస్తున్న ప్రేక్షకులకు రుణపడి ఉంటామని నిర్మాత స్వప్నా దత్ అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
