న్యూఢిల్లీ: ఇండియా స్టార్ షట్లర్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ కొత్త సీజన్‌ను విజయంతో స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. మంగళవారం మొదలయ్యే సీజన్ స్టార్టింగ్ ఇండియా ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్‌లో ఈ ఇద్దరూ టైటిల్ టార్గెట్‌గా బరిలోకి దిగుతున్నారు. కరోనా కారణంగా రెండుసార్లు వాయిదా పడ్డ ఈ మెగా టోర్నీ ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ భయం ముంగిట స్టార్ట్ అవుతోంది. కరోనా పాజిటివ్‌గా తేలిన తెలుగు షట్లర్ సాయి ప్రణీత్, డబుల్స్ ప్లేయర్ ధ్రువ్ రావత్ ఈ టోర్నీకి దూరమయ్యాడు. తమ క్యాంప్‌లో ఇద్దరు ప్లేయర్లు కరోనా బారిన పడటంతో ఇంగ్లండ్ టీమ్ మొత్తం విత్‌డ్రా అయింది. అయితే, ఇండియన్స్ సింధు, శ్రీకాంత్, సైనా నెహ్వాల్ పాటు న్యూ వరల్డ్ చాంప్ లో కీన్ యు, మూడుసార్లు వరల్డ్ చాంప్ జోడీ మొహమ్మద్ అహ్‌సాన్–హెండ్రా సెతైవన్ వంటి టాప్ ప్లేయర్లు బరిలో ఉన్నారు. అందరి ఫోకస్ మాత్రం లోకల్ ఫేవరెట్స్ అయిన సింధు, శ్రీకాంత్, యంగ్‌సెన్సేషన్ లక్ష్యసేన్‌పై ఉండనుంది.

