కీలక సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్న ఇండియా, పాక్

కీలక సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్న ఇండియా, పాక్

న్యూఢిల్లీ/ ఇస్లామాబాద్​: న్యూక్లియర్​ స్థావరాలకు సంబంధించిన లిస్ట్​లను మన దేశం, పాకిస్తాన్  బుధవారం ఇచ్చిపుచ్చుకున్నాయి. న్యూక్లియర్ స్థావరాలపై  ఒక దేశం మరొక దేశం దాడి చేసుకోకుండా  డిసెంబర్​ 31, 1988లో   రెండు దేశాలు అగ్రిమెంట్​ చేసుకున్నాయి.  జనవరి 1, 1992 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.   రెండు దేశాలు దీనిని1992 నుంచి  కొనసాగిస్తున్నాయి. ఈ అగ్రిమెంట్ లో భాగంగా​తమ దేశంలోని న్యూక్లియర్​ స్థావరాల లిస్ట్​ను ఇస్లామాబాద్​లోని మన​ హైకమిషన్​ ప్రతినిధికి  అందజేసినట్టు పాకిస్తాన్​ బుధవారం  తెలిపింది.  మనదేశంలో  ఉన్న న్యూక్లియర్​ స్థావరాల లిస్ట్​ను కూడా న్యూఢిల్లీలోని పాకిస్తాన్​ హైకమిషన్​కు అందజేసినట్టు ఫారెన్​ మినిస్ట్రీ ప్రతినిధి చెప్పారు.  రెండు దేశాలు ఒకే రోజు తమ దగ్గరున్న  న్యూక్లియర్​ ఇన్​స్టలేషన్స్​ సమాచారాన్ని  పంచుకున్నాయి.  ఆర్టికల్​ 370 రద్దు తర్వాత రెండు దేశాల మధ్య  సంబంధాలు
దెబ్బతిన్నాయి.