గూగుల్కు పోటీగా OpenAI సెర్చ్ ఇంజిన్.. మే13న లాంచ్ కానుందా?.. ఫుల్ డిటెయిల్స్

గూగుల్కు పోటీగా OpenAI సెర్చ్ ఇంజిన్.. మే13న లాంచ్ కానుందా?.. ఫుల్ డిటెయిల్స్

OpenAI గూగుల్కు పోటీగా సెర్చ్ ప్రాడక్ట్ను ప్రారంభిస్తుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కొత్త సెర్చ్ ఇంజిన్ ఎప్పుడు వస్తుం దా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. కొత్త సెర్చ్ ఇంజిన్ లాంచింగ్పై సోమవారం (మే13) ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) OpenAI కు చెందిన ChatGPT ప్రారంభించిన తర్వాత చాలా మంది ఈ కాన్సెప్ట్పై చాలా ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఈ చాట్బాట్ మనుషుల మాదిరిగానే సమాధానాలు ఇవ్వడం ద్వారా 2022 లో ఇంటర్నెట్ రంగంలో సంచలనం సృష్టించింది. ChatGPT అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కొత్త టెక్నాలజీని వివిధ కోణాల్లో పరీక్షించారు కస్టమర్లు. కవితలు రాయాలని కొందరు. లైఫ్ కు సంబంధించిన సలహా లు ఇవ్వాలని ఇంకొందరు, ఫ్రిక్షన్ స్టోరీలు  కావాలని ..ఇలా ప్రశ్నలతో తమ సందేహాలను తీర్చుకున్నారు. 

అయితే కొద్దికాలంలోనే చాలా కంపెనీలు తమ స్వంత AI చాట్ బాట్ లను రూపొందించడం ప్రారంభించాయి. OpenAI ప్రస్తుతం Google కు చెందిన జెమినీ, ఆంత్రోపిక్స్ క్లాడ్, X  కు చెందిన GrokAI వంటి వాటినుంచి గట్టి పోటీనీ ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులలో కంపెనీ Google ఆధిపత్యం ఉన్న సెర్చింగ్ మార్కెట్లోకి  ప్రవేశించడానికి ప్రణాళికలను సిద్దం చేసింది. అదే ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్. 

గూగుల్ సెర్చ్ కాంపిటీటర ను ప్లాన్ చేస్తున్న OpenAI గురించి చాలాకాలంగా ప్రచారంలో ఉంది. అయితే రాయిటర్స్ నివేదిక ప్రకారం.. OpenAI దానిAI ఆధారిత సెర్చ్ ప్రాడక్ట్  లాంచింగ్ సోమవారం జరగొచ్చని భావిస్తున్నారు. అదీ కూడా Google వార్షిక 1/0 ఈవెంట్ కు సరిగ్గా ఒక రోజు ముందు ఉంది. అయితే ఈ విషయంపై OpenAI ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.