Darling Movie: భార్య చేతిలో కీలు బొమ్మ‌గా మారిన భ‌ర్త స్టోరీ కంప్లీట్..వీడియో చూస్తే మీకే అర్ధమైపొద్ది  

Darling Movie: భార్య చేతిలో కీలు బొమ్మ‌గా మారిన భ‌ర్త స్టోరీ కంప్లీట్..వీడియో చూస్తే మీకే అర్ధమైపొద్ది  

పెళ్లి చూపులు(Pelli Chupulu) సినిమాతో కమెడియన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ప్రియదర్శి(Priyadarshi).ఈ సినిమాలో అతని నటనతో ఎంతోమంది ఆడియన్స్ ను అలరించడమే కాదు..సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాడు.ఆ తరువాత కూడా చాలా సినిమాల్లో కమెడియన్ గా చేసి అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. కానీ, బలగం సినిమాతో తనలోని మరోకోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు ప్రియదర్శి.ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

అయితే..బలగం సినిమా తరువాత ప్రియదర్శికి ప్రత్యేకపాత్రల డిమాండ్ పెరిగింది.ఇటీవల వచ్చిన మంగళవారం సినిమాలో కూడా ప్రత్యేకపాత్రలో కనిపించి మెప్పించాడు.ఆ పాత్రకి కూడా ప్రశంసలు అందుకున్నాడు ప్రియదర్శి.ఇక ప్రస్తుతం సోలో హీరోగా మారిపోయాడు ఈ కమెడియన్. హీరోగా వరుస క్రేజీ సినిమాలను ఒకే చేస్తున్నాడు.అందులో ముందుగా డార్లింగ్ సినిమా ఉంది.ఇస్మార్ట్ బ్యూటీ నాభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 

తాజా సమాచారం ప్రకారం..డార్లింగ్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే..భార్య భర్తల మధ్య జరిగే గొడవ నేపథ్యంలో డార్లింగ్ కథ ఉన్నట్లు తెలుస్తోంది.

ఒక తల్లిలా,చెల్లిగా ఉన్నప్పుడు ప్రేమ ఒకలా..లవర్ గా..ఇక లవర్ భార్యగా అయితే పిచ్చి పిక్స్ అనేలా ఉంటుందనే కాన్సెప్ట్ పాతదే అయిన రిలీజ్ చేసిన వీడియోలో పెర్ఫార్మన్స్ మాత్రం అదిరిపోయింది.ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత భార్య చేతిలో కీలు బొమ్మ‌గా మారిన భ‌ర్తల స్టోరీని తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే. 

హనుమాన్ మూవీని నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.డీసెంట్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, మురళీధర్ గౌడ్, శివ రెడ్డి మరియు కృష్ణ తేజ వంటి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఇక టాలీవుడ్ స్టార్ రానా నిర్మాణ సంస్థలో మరో సినిమా చేస్తున్నారు ప్రియదర్శి. ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమాను  కొత్త డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. కామెడీ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇవేకాకుండా..దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటితో కూడా ఓ సినిమాను ఓకే చేశాడు ప్రియదర్శి. 

శ్రీదేవీ మూవీస్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో రూప కొడవాయూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్టులను ఒకే చేస్తూ కెరీర్ పీక్స్ లో ఉన్నాడు ప్రియదర్శి. ఈ మూడు సినిమాల్లో ఒక్కటి హిట్టయినా మనోడి క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరడం ఖాయం.