యూఏఈకి సాయం చేసిన మన దేశం

యూఏఈకి సాయం చేసిన మన దేశం
  •  కరోనా పేషంట్ల ట్రీట్‌మెంట్‌ కోసం
  • హైడ్రాక్సిక్లోరోక్విన్‌ పంపిన ఇండియా

న్యూఢిల్లీ: యునైటెడ్‌ అరబ్‌ ఎమరైట్స్‌ (యూఏఈ)లో కరోనా పేషంట్లకు ట్రీట్‌మెంట్‌ ఇచ్చేందుకు మన దేశం సాయం చేస్తోంది. ఆ దేశానికి అవసరమైన హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను పంపాలని యూఏఈ కోరగా.. దానికి మన దేశం ఒప్పుకుందని ఢిల్లీలోని గల్ఫ్‌ అరబ్‌స్టేట్స్‌ ఎంబసీ చెప్పింది. “ 5.5 మిలియన్‌ పిల్స్‌తో ఫస్ట్‌ షిప్‌మెంట్‌ను పంపారు” అని ఎంబసీ ట్వీట్‌ చేసింది. కరోనాను తగ్గించేందుకు హైడ్రాక్సిక్లోరోక్విన్‌ బాగా ఉపయోగపడుతుండటంతో మన దేశం వాటి ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో యూఎస్‌ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు చాలా మంది దేశాధినేతలు పిల్స్‌ పంపాలని కోరడంతో కేంద్రం దానికి ఒప్పుకుని ఆయా దేశాలక సాయం చేసింది. ఈ మేరకు యూఎస్‌, మారీసెస్‌ తదితర దేశాలుకు ఇప్పటికే మందులను పంపారు.