ఫస్ట్‌‌ వన్డేలో ఇండియా ఓటమి

ఫస్ట్‌‌ వన్డేలో ఇండియా ఓటమి
  • ఫస్ట్‌‌ వన్డేలో ఇండియా ఓటమి
  • 31 రన్స్‌‌తో సౌత్రాఫికా విక్టరీ
  • డుసెన్‌‌, బవూమ సెంచరీలు

పార్ల్‌‌‌‌:  టెస్టు సిరీస్‌‌లో ఫెయిలైన టీమిండియా.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌‌ను ఓటమితో షురూ చేసింది. మిడిల్‌‌ ఓవర్ల బౌలింగ్‌‌, మిడిలార్డర్‌‌ బ్యాటర్ల ఫెయిల్యూర్‌‌ టీమ్‌‌ను దెబ్బకొట్టింది. దాంతో, మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి పోరులో ఇండియా 31 రన్స్‌‌ తేడాతో ఓడిపోయింది.  మరోవైపు వాండర్‌‌ డుసెన్‌‌ (96 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 129 నాటౌట్‌‌), కెప్టెన్‌‌ టెంబా బవూమ (143 బాల్స్‌‌లో 8 ఫోర్లతో 110) సెంచరీలకు తోడు బౌలర్లు సత్తా చాటడంతో సఫారీ టీమ్​ ఈజీగా గెలిచింది.  ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన హోమ్‌‌టీమ్‌‌   50 ఓవర్లలో 296/4 స్కోరు చేసింది. అనంతరం ఛేజింగ్‌‌లో ఓవర్లన్నీ ఆడిన ఇండియా 265/8 మాత్రమే చేసి ఓడింది. ఓపెనర్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌ (79), విరాట్‌‌ కోహ్లీ (51)తో పాటు చివర్లో శార్దూల్‌‌ ఠాకూర్‌‌ (50 నాటౌట్) ఫిఫ్టీ కొట్టినా ఫలితం లేకపోయింది. డుసెన్‌‌కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. రెండో వన్డే  శుక్రవారం జరుగుతుంది. 

ధవన్‌‌, కోహ్లీ, ఠాకూర్‌‌ పోరాడినా.. 
భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో  సీనియర్‌‌ ఓపెనర్‌‌ ధవన్‌‌ ముందు నుంచే జోరు చూపెట్టాడు. వరుస ఫోర్లతో  ఫస్ట్‌‌ వికెట్‌‌కు కెప్టెన్‌‌ లోకేశ్‌‌ రాహుల్‌‌ (12) 46 రన్స్‌‌ జోడించాడు. తొమ్మిదో ఓవర్లో మార్‌‌క్రమ్‌‌  (1/30)బౌలింగ్‌‌లో రాహుల్‌‌ కీపర్‌‌కు కాచ్ ఇచ్చి ఔటైనా.. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన విరాట్‌‌ కోహ్లీతో ధవన్‌‌ అదే స్పీడు కొనసాగించాడు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీ బ్యాటర్‌‌గా బాగానే ఆడాడు. తన ట్రేడ్‌‌మార్క్‌‌ డ్రైవ్స్‌‌ కొట్టాడు.14వ ఓవర్లోనే ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేసుకున్న ధవన్‌‌.. 19వ ఓవర్లో బౌండ్రీతో స్కోరు వంద దాటించాడు. అటు కోహ్లీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడటంతో సగం ఓవర్లకు 137/ 1 స్కోరుతో నిలిచిన ఇండియా ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ, తర్వాతి ఓవర్లో  స్పిన్నర్‌‌ కేశవ్‌‌ (1/42)వేసిన షార్ప్‌‌ టర్నింగ్‌‌ బాల్‌‌కు ధవన్‌‌ క్లీన్‌‌బౌల్డ్‌‌ అవడంతో మ్యాచ్‌‌ టర్న్‌‌ అయింది.ఆపై, ఎంగిడి (2/64), ఫెలుక్వాయో (2/26), షంసీ (2/52)  దెబ్బకు మన మిడిలార్డర్‌‌లో ఒక్కరు కూడా నిలవలేకపోయారు. శ్రేయస్‌‌ (17), పంత్‌‌ (16), డెబ్యూ ప్లేయర్‌‌ వెంకటేశ్‌‌ అయ్యర్‌‌ (2), అశ్విన్‌‌ (7), భువనేశ్వర్‌‌ (4) అలా వెళ్లి ఇలా వచ్చారు. 62 రన్స్‌‌ తేడాతో ఆరు వికెట్లు పడడంతో మ్యాచ్​ సఫారీల చేతుల్లోకి వెళ్లింది. చివర్లో బుమ్రా  (14 నాటౌట్‌‌) సపోర్ట్‌‌తో  శార్దూల్‌‌ ఠాకూర్‌‌  స్పీడ్‌‌గా ఆడి ఇండియాకు భారీ ఓటమి తప్పించాడు. 

204 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ 
బ్యాటర్ల మాదిరిగా మన బౌలర్లు స్టార్టింగ్‌‌లోనే వికెట్లు తీసి హోమ్‌‌టీమ్‌‌ను ఇబ్బంది పెట్టినా అదే జోరు కంటిన్యూ చేయలేకపోయారు. అటువైపు డుసెన్‌‌, బవూమ ఫోర్త్‌‌ వికెట్‌‌కు 204 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌తో హోమ్‌‌టీమ్‌‌కు భారీ స్కోరు అందించారు. టాస్‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌కు దిగిన సౌతాఫ్రికాకు ఐదో ఓవర్లోనే షాక్‌‌ తగిలింది. బుమ్రా (2/48)  ఓ ఔట్‌‌ స్వింగర్‌‌తో ఓపెనర్‌‌ జనేమన్‌‌ మలన్‌‌ (6)ను ఔట్‌‌ చేశాడు. అశ్విన్‌‌ (1/53).. 16వ ఓవర్లో మరో ఓపెనర్‌‌ డికాక్‌‌ (27)ను బౌల్డ్‌‌ చేయగా.. రెండు ఓవర్ల తర్వాత వెంకటేశ్‌‌ అయ్యర్‌‌ డైరెక్ట్‌‌ త్రోకు మార్‌‌క్రమ్‌‌ (4) రనౌట్‌‌ అవడంతో సఫారీ టీమ్‌‌ 68/3తో కష్టాల్లో పడి 200 కూడా చేయడం కష్టమే అనిపించింది. కానీ, ఈ టైమ్‌‌లో బవూమకు డుసెన్‌‌ తోడయ్యాడు. ఇద్దరూ సూపర్‌‌గా బ్యాటింగ్‌‌ చేస్తూ ఇన్నింగ్స్‌‌ను బిల్డ్‌‌ చేశారు. బవూమ స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేయగా.. డుసెన్‌‌ దూకుడుగా ఆడాడు.  స్వీప్‌‌, రివర్స్‌‌ స్వీప్‌‌,  పికప్‌‌ షాట్స్‌‌తో మెప్పించాడు. ఈ క్రమంలో ఇద్దరూ సెంచరీ కంప్లీట్‌‌ చేసుకున్నారు   శార్దూల్‌‌ (0/72),  భువనేశ్వర్‌‌ (0/64) ఎక్కువ రన్స్​ ఇచ్చారు.