V6 News

ఫస్ట్ పంచ్ మనదే.. ఇంగ్లాండ్ పై భారత్ గ్రాండ్ విక్టరీ

ఫస్ట్ పంచ్ మనదే.. ఇంగ్లాండ్ పై భారత్ గ్రాండ్ విక్టరీ

 ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి వన్డేలో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఇంగ్లాండ్ పై 66 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 318 పరుగుల టార్గెట్ బరిలోకి దిగిన ఇంగ్లాండ్..  భారత బౌలర్ల దాటికి 251 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్  జాన్సన్ రాయ్ 46, బెయిర్ స్టో 94, మొయిన అలీ 30 మినహా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో అరంగ్రేట్ర ఆటగాడు ప్రసిద్ధ కృష్ణకు  4 వికెట్లతో అదరగొట్టాడు. శార్దూల్ టాకూర్ 3, భువనేశ్వర్ కుమార్  2, కృనాల్ పాండ్యా ఒక వికెట్లు తీశారు.

మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో5 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 28, శిఖర్ ధావన్ 98 ,కోహ్లీ 56 తో చెలరేగారు. కేఎల్ రాహుల్ 62, కృనాల్ పాండ్యా58 తో నాటౌట్ గా నిలవడంతో భారత్ 317 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో  స్టోక్స్ 3, మార్క్ ఉడ్ కు రెండు వికెట్లు పడ్డాయి. మూడు వన్డేల సిరీస్ లో భారత్ 1-0తో ముందంజలో ఉంది.