భారత మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ఫొటోను రైల్వే శాఖ సోమవారం రిలీజ్ చేసింది. వైట్, ఆరెంజ్ కలర్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్‌ను అధికారులు ప్రదర్శించారు. జపాన్ సాంకేతికత, ఆర్థిక సహాయంతో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ ముంబై, అహ్మదాబాద్ సిటీలను కలపనుంది.
భారత మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ఇదే.. సోమవారం ఢిల్లీలోని రైల్ భవన్‌లో రైల్వే శాఖ ఈ ఫొటోను మీడియాకు రిలీజ్ చేసింది. వైట్, ఆరెంజ్ కలర్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్‌ను అధికారులు ప్రదర్శించారు.
జపాన్ సాంకేతికత, ఆర్థిక సహాయంతో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ ముంబై, అహ్మదాబాద్ సిటీలను కలపనుంది. ‘ది నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్’ (ఎన్‌హెచ్‌ఎస్ఆర్‌సీఎల్) ఈ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను చేపడుతోంది.
దాదాపు రూ.1.08 లక్షల కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 508.17 కిలోమీటర్ల పొడవున ఈ బుల్లెట్ ట్రైన్ ట్రాక్‌ను నిర్మిస్తోంది. ఇది గంటకు 320 నుంచి 350 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకెళ్లనుంది. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్ మధ్య రైలు ప్రయాణానికి 8 గంటల సమయం పడుతుండగా, ఈ హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే అది కేవలం 2 గంటలకు తగ్గిపోనుంది.
