ఆక్లాండ్: న్యూజిలాండ్ టూర్‌లో హోమ్‌టీమ్‌తో ఆరు మ్యాచ్‌లను ఇండియా విమెన్స్ టీమ్ క్లీన్స్‌టౌన్‌లోనే ఆడనుంది. ఒక టీ20, ఐదు వన్డేల సిరీస్ కోసం ఇండియా ఇప్పటికే కివీస్ చేరుకుంది. ఫిబ్రవరి 9 నుంచి ఈ సిరీస్ స్టార్ట్ అవుతుంది. అయితే కరోనా ముప్పు తగ్గించేందుకు ఈ ఆరు మ్యాచ్‌లనూ క్వీన్స్‌టౌన్ స్టేడియంలోనే నిర్వహించాలని కివీస్ బోర్డు డిసైడైంది. కివీస్ లోనే మార్చి-–ఏప్రిల్ లో వరల్డ్ కప్ ఉన్నందుకు ఈ సిరీస్ రెండు జట్లకు కీలకం కానుంది. ఫిబ్రవరి 9న టీ20, అదే నెల 11, 14, 16, 22, 24వ తేదీల్లో ఐదు వన్డేలు జరుగుతాయి.

