సిడ్నీలో రేపు(7న) ఆసిస్ తో జరగనున్న మూడో టెస్టుకు టీమిండియా జట్టును ప్రకటించింది బీసీీసీఐ. ఇక దాదాపు సంవత్సరం తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మకు స్థానం లభించింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కు బదులు రోహిత్ ను తీసుకున్నారు. టెస్టులో రోహిత్ ఒపెనర్ గా రావడమే గాకుండా వైస్ కెప్టెన్ గా ఉండనున్నాడు. అంతేగాకుండా 28 ఏళ్ల నవదీప్ సైనీకి చాన్స్ ఇచ్చింది బీసీీసీఐ.
ఇండియా జట్టు: రహానే(కెప్టెన్) రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్ , పుజారా, విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, బుమ్రా, సిరాజ్, నవదీప్ సైనీ
Team India's Playing XI for the 3rd Test against Australia at Sydney- A Rahane (C), R. Sharma, S. Gill, C Pujara, H Vihari, R. Pant (WK), R Jadeja, R Ashwin, J Bumrah, M Siraj and N Saini; Navdeep Saini to make his debut: BCCI pic.twitter.com/cM9xkKiZIi
— ANI (@ANI) January 6, 2021

