ఏడాదిలో కడితే ఇన్సెంటివ్, లేకుంటే ఫైన్..ఇందిరమ్మ టవర్స్ కాంట్రాక్టర్లకు హౌసింగ్ బోర్డ్ ఆఫర్

ఏడాదిలో కడితే ఇన్సెంటివ్, లేకుంటే ఫైన్..ఇందిరమ్మ టవర్స్ కాంట్రాక్టర్లకు హౌసింగ్ బోర్డ్ ఆఫర్

హైదరాబాద్, వెలుగు : క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్ల నిర్మాణం దక్కించుకున్న కాంట్రక్టర్లకు ప్రభుత్వం కొత్త రూల్ పెట్టింది. పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి ఏడాదిలోగా టవర్ల టవర్ల నిర్మాణం పూర్తి చేస్తే ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించింది. అదే సమయంలో నిర్మాణం లేట్ అయితే మాత్రం ఫైన్ విధిస్తామని పేర్కొంది. 

16 నియోజకవర్గాల్లో 7,340 ఫ్లాట్స్ నిర్మాణాన్ని 10 ప్యాకేజీలుగా డివైడ్ చేసిన హౌసింగ్ బోర్డు గత నెల 29న టెండర్లు పిలిచింది. ఈ టెండర్ కు ప్రీబిడ్ నిర్వహించగా 18 కంపెనీలు పాల్గొన్నాయి. వచ్చే ఏడాది బోనాల పండుగను ఇందిరమ్మ టవర్ల నుంచే నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. 

ఇందులో భాగంగా టవర్ల పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని చెప్పింది. ఇచ్చిన గడువు కంటే ముందే పూర్తి చేస్తే టెండర్ వాల్యూలో ఒక శాతం ఇన్సింటివ్ ఇస్తామని, లేట్ చేస్తే అదే ఒక శాతం ఫైన్ విధిస్తామని స్పష్టం చేసింది.

 ఒక్కో ప్యాకేజ్ సుమారుగా రూ. 43.20 కోట్ల ఉంది. అత్యధికంగా మూడు నియోజకవర్గాలకు కలిపి రూ.129.60 కోట్లు, మరో రెండు ప్యాకేజీల్లో రూ.86.40 కోట్ల చొప్పున రెండు ఉన్నాయి. కాగా టెండర్ దక్కించుకున్న కంపెనీ ప్రతినిధులు, డ్రాలో ఫ్లాట్ దక్కిన 480 మందితో మీటింగ్ నిర్వహించనున్నారు. 16 నియోజకవర్గాల్లో 7,340 ఫ్లాట్లకు శుక్రవారం నుంచి డ్రా తీస్తుండగా సోమవారం పూర్తి కానుంది.