పశు వైద్య వర్సిటీలో అక్రమాలపై విచారణ జరిపించాలి : విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్

పశు వైద్య వర్సిటీలో అక్రమాలపై విచారణ జరిపించాలి : విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్

పంజాగుట్ట, వెలుగు: పీవీ పశు వైద్య విశ్వవిద్యాలయంలో జరిగిన ఉద్యోగ నియామకాలపై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ డిమాండ్ చేశారు. సోమాజీగూడ ప్రెస్​క్లబ్‌‌‌‌లో గురువారం ఆయన మాట్లాడుతూ.. నకిలీ సర్టిఫికెట్​ను ఆమోదించి బాలాజీ నాయక్ అనే అభ్యర్థికి అసిస్టెంట్​ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చారన్నారు. 

ప్రొఫెసర్ ఆర్.ఎస్.ప్రసన్నకుమార్ అనర్హులకు నకిలీ పత్రాలతో ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. కోర్టు తీర్పు ఇచ్చినా.. అనర్హులను పూర్తిగా తొలగించకుండా.. కేవలం తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారని మండిపడ్డారు. ప్రసన్నకుమార్​వర్సిటీ ఆస్తులను సొంతానికి వాడుకున్నారని అన్నారు. తమపై అసత్య ఆరోపణలు చేసినందుకు వారం రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూనివర్సిటీలో అక్రమాలపై విచారణ జరిపి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. జేఏసీ ఉపాధ్యక్షుడు షేక్​హుస్సేన్, కార్యదర్శి జగన్నాథ్​యాదవ్ తదితరులు పాల్గొన్నారు.