ఏప్రిల్ 10లోపే ఇంటర్ ఫలితాలు

ఏప్రిల్ 10లోపే ఇంటర్ ఫలితాలు

 

  •   4 లేదా 5వ తేదీల్లో ఇచ్చేందుకు 
  • బోర్డు కసరత్తు 
  •     15 నుంచి అన్ని సబ్జెక్టుల పేపర్ల వాల్యుయేషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలను సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తున్నది. ఏప్రిల్10వ తేదీ లోపే ఫలితాలను ప్రకటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఏప్రిల్ 4 లేదా 5వ తేదీల్లోనే రిజల్ట్స్ ఇచ్చేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒకవేళ మూల్యాంకన ప్రక్రియ ఆలస్యమైతే.. మరో రెండు, మూడు రోజులు అటు ఇటు అయ్యే అవకాశం ఉందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 4వ తేదీ నుంచే సంస్కృతం, అరబిక్, ఫ్రెంచ్ వంటి లాంగ్వేజ్ సబ్జెక్టుల వాల్యుయేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. అయితే, ఈ నెల 15వ తేదీ నుంచి అన్ని ప్రధాన సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 20 స్పాట్ క్యాంపులను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఒకేషనల్ విద్యార్థుల కోసం ఒక వాల్యుయేషన్ క్యాంప్‌‌‌‌‌‌‌‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దాదాపు 30 వేల మంది లెక్చరర్ల సేవలను బోర్డు వినియోగించుకోనుంది. 

పకడ్బందీగా వాల్యుయేషన్..

ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ఈ ప్రాసెస్ అంతా సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే నిర్వహిస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా రిజల్ట్ ఇచ్చి విద్యార్థుల టెన్షన్ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.           
-  కృష్ణ ఆదిత్య, ఇంటర్ బోర్డు సెక్రటరీ