చేవెళ్ల, వెలుగు: ఒంటరి వ్యక్తులే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను షాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహేశ్వరం మండలం అమీర్‌పేటలో అద్దెకు ఉంటున్న యూపీకి చెందిన సచిన్, హరిరాజ్ సింగ్, నాగేంద్ర సింగ్ ఈజీమనీ కోసం దొంగతనాల బాట పట్టారు. ఈ నెల 7న నందిగామ మండలానికి చెందిన రెడ్డిమోని భారతమ్మ(55) మద్దూర్ గేటు వద్ద బస్సు దిగి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా, బైక్‌పై వచ్చిన ఈ ముగ్గురు నిందితులు ఆమె మెడలోని 3.5 తులాల పుస్తెలతాడు, గొలుసు లాక్కొని పారిపోయారు.
బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన క్రైమ్ టీమ్.. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులు యూపీలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సచిన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని చేవెళ్ల ఏసీపీ కిషన్ శనివారం మీడియాకు వెల్లడించారు.
