V6 News

నెక్స్ట్ మ్యాచ్ కు అంబటి రాయుడు రెడీ!

నెక్స్ట్ మ్యాచ్ కు అంబటి రాయుడు రెడీ!

మళ్లీ సురేష్ రైనా రావాలంటున్న ఫ్యాన్స్

దుబాయ్‌: వరుస ఓటముల వల్ల ఐపీఎల్​లో ఎప్పుడు లేనివిధంగా చెన్నై సూపర్​ కింగ్స్​ తీవ్ర ఒత్తిడిలో ఉంది. సురేశ్​ రైనా లేకపోవడం జట్టు బ్యాలెన్స్​ను దెబ్బతీస్తే.. అంబటి రాయుడు గాయపడడం మరింత నష్టం కలిగించింది. రాయుడు లేకపోవడం కచ్చితంగా లోటు అని ఢిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​ అనంతరం సీఎస్కే కెప్టెన్​ ధోనీ కూడా అన్నాడు. అయితే తమ తర్వాతి మ్యాచ్​కు రాయుడు అందుబాటులో ఉంటాడని ధోనీ నమ్మకంగా ఉన్నాడు. ‘ కాంబినేషన్​ పరంగా తర్వాతి మ్యాచ్​కు మరింత క్లారిటీతో రావాల్సి ఉంది. రాయుడు తర్వాతి మ్యాచ్​కు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నా. జట్టులో మరికొన్ని సమస్యలపైనా దృష్టి పెట్టాల్సి ఉంది. ఎక్స్​ట్రా బ్యాట్స్​మన్​తో ఆడుతున్నాం. అందువల్ల ప్లేయర్లంతా మరింత బాధ్యతగా ఆడి తీరాలి’ అని ధోనీ చెప్పాడు. రాజస్తాన్​, ఢిల్లీ చేతిలో సీఎస్కే ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురైన ఫ్యాన్స్​ సురేశ్​ రైనాను తిరిగి జట్టులోకి తీసుకోవాలని కోరుతున్నారు. రైనా అంశంపై సీఎస్ కే సీఈవో క్లారిటీ ఇచ్చేశారు. ఈ సీజన్​లో అతన్ని మళ్లీ చూసే అవకాశం లేదని తేల్చేశారు.

మరో రెండు మ్యాచ్ లకు అశ్విన్ దూరం

కింగ్స్​ ఎలెవెన్​ పంజాబ్​తో జరిగిన మ్ యాచ్​లో గాయపడిన ఢిల్లీ క్యాపిటల్స్​ స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ లీగ్ లో మరో రెండు, మూడు మ్యాచ్​లకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ కెప్టెన్​ శ్రేయస్ అయ్యర్​ కన్ఫామ్ చేశాడు.